News January 20, 2025

ఏపీ ఖజానా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా చంద్ర శేఖర్

image

ఆంధ్రప్రదేశ్ ఖజానా, లెక్కల సర్వీసెస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా శాఖ కార్యవర్గ ఎన్నికలను ఆదివారం జిల్లా ఖజానా కార్యాలయంలో నిర్వహించారు. అసోసియేషన్ ఎన్నికల అధికారి ప్రభు దాస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా హెచ్.చంద్ర శేఖర్ (సీనియర్ అకౌంటెంట్), జిల్లా కార్యదర్శిగా వై.శ్రీనివాస రాజు (సీనియర్ అకౌంటెంట్), తదితర సభ్యులను ఎన్నుకున్నారు.

Similar News

News January 19, 2025

సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తా: టీజీ వెంకటేశ్

image

నాయి బ్రాహ్మణ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం కర్నూలులో జరిగిన శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాలను కేఎంసీ కమిషనర్ రవీంద్రబాబు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సదాశివతో కలిసి టీజీ వెంకటేశ్ ప్రారంభించారు. నాయి బ్రాహ్మణ కులవృత్తి మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతుందని అన్నారు.

News January 19, 2025

‘రాయలసీమ వనరుల వినియోగానికి సహకరించండి’

image

రాయలసీమ వనరుల వినియోగానికి కూటమి ప్రభుత్వం సహకరించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం  నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

News January 19, 2025

కర్నూలు: ఘనంగా వేమన జయంతి 

image

యువత వేమన పద్యాల సారాంశాన్ని పాటించి అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. ఆదివారం కర్నూలు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.