News July 23, 2024
ఏపీ నష్టాన్ని పూడ్చే దిశగా కేంద్ర బడ్జెట్: కేంద్ర మంత్రి రామోహ్మన్
ఏపీకి గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాన్ని పూడ్చే దిశగా తాజా కేంద్ర బడ్జెట్ అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు. పార్లమెంట్ వెలుపల ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏపీకి సహాయం అందిచకపోతే అభివృద్ధి సాధించడం కష్టం అన్నారు. ప్రధాని మోదీ అర్థం చేసుకొని ఏపీ అభివృద్ధికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 27, 2024
శ్రీకాకుళంలో పెన్షన్ ఒకరోజు ముందే అందజేత
శ్రీకాకుళం జిల్లా వాసులకు ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో శుభవార్త చెప్పింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉండే పెన్షన్ దారులకు ఈనెల 30వ తేదీనే పెన్షన్ అందజేయనుంది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది అందజేయనున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉండే 3.14 లక్షల మంది పెన్షన్ దారులు ఉండగా వారందరికీ ప్రభుత్వం పెన్షన్ ఒక రోజు ముందుగానే అందజేయాలని నిర్ణయించింది.
News November 27, 2024
శ్రీకాకుళంలో మొదలైన చలి
శ్రీకాకుళంలోని చలి విజృంభిస్తోంది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల సమయం అయినా చలి తీవ్రత తగ్గడం లేదు. శ్రీకాకుళంలోని పలు పల్లె ప్రాంతాల్లో పొగ మంచం అలుముకుంది. ఈ క్రమంలో జిల్లాలోని రాత్రి సమయాల్లో 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవుతుంది. డిసెంబర్ నెల దగ్గర కావస్తుండడంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిణుపులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 27, 2024
SKLM: పొందూరు సింహాచలంపై ACB సోదాలు
ఏసీబీ అధికారులకు మరో భారీ చేప చిక్కింది. VSKPలోని GVMC జోన్-2. జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలంపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. దీంతో శ్రీకాకుళం, ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలో సింహాచలం, బంధువులు ఇళ్లలో సోదాలు చేసింది. ఇంటి స్థలాలు, 4.60 హె. భూమి, లక్షల విలువ గల కారు, బంగారు ఆభరణాలతో పాటుగా బ్యాంక్ ఖాతాలో నగదు ACB గుర్తించింది. కేసు నమోదు చేసిన ACB దర్యాప్తు చేస్తోంది.