News February 20, 2025

ఏపీ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

గోస్పాడులోని ఏపీ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ జీ.రాజకుమారి గురువారం తనిఖీ చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలు, తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆర్‌‌వో ప్లాంట్‌లో లీకేజీ సమస్యను గుర్తించి మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలోని ల్యాబ్‌ గదులన్నింటికీ తాళాలు వేయకుండా వాటిని క్రమం తప్పకుండా వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు.

Similar News

News February 5, 2026

ANU: బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరిగే బీఈడీ రెగ్యులర్, సప్లిమెంటరీ, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయని చెప్పారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.

News February 5, 2026

UPSC అప్లికేషన్‌ ప్రాసెస్‌లో కీలకమార్పులు

image

ఆలిండియా సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ 2026లో UPSC కీలక మార్పులు చేసింది. అప్లై చేసేటప్పుడు పాస్‌పోర్ట్ ఫొటోతోపాటు లైవ్ ఫొటోను కూడా తప్పనిసరి చేసింది. 2 ఫొటోలు మ్యాచ్ కాకుంటే అప్లికేషన్ రిజెక్టవుతుందని తెలిపింది. వైట్ పేపర్‌పై బ్లాక్ ఇంక్ పెన్‌తో 3సార్లు సంతకం చేసి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎగ్జామ్ ప్రొసీజర్లలో పారదర్శకతకు ఈ విధానం సహాయపడుతుందని చెప్పింది.

News February 5, 2026

కవిత వ్యవహారంతో బీఆర్ఎస్ బండారం బయటపడింది: కిషన్ రెడ్డి

image

దోచుకున్న డబ్బు పంచుకునే విషయంలోనే కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, కవిత వ్యవహారమే ఇందుకు నిదర్శనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక మున్సిపల్ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో “సారు-కారు” అంటూ రాష్ట్రాన్ని ఖాళీ చేశారని ఎద్దేవా చేశారు. అధికారం పోయాక వాటాల గొడవలతో ఆ కుటుంబం రోడ్డున పడిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పాలని కోరారు.