News November 11, 2025
ఏపీ వారికీ నేను మామనే: శివరాజ్‌సింగ్

AP: మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చెప్పారు. వాటర్‌షెడ్ పథకం కింద గుంటూరు(D) వెంగళాయపాలెం చెరువు పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ‘దీనిద్వారా భూగర్భజలాలు పెరగడంతోపాటు పశువులకు తాగునీరు లభిస్తుంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చెరువులను అభివృద్ధి చేస్తాం. మధ్యప్రదేశ్ ప్రజలు నన్ను మామ అంటారు. ఇకపై AP వారికీ మామనే’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News November 11, 2025
రేపు సామూహిక గృహప్రవేశాలు.. పాల్గొననున్న సీఎం

AP: సీఎం చంద్రబాబు రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజావేదికలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతోనూ ముచ్చటిస్తారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా గత నెలలోనే సీఎం పర్యటించాల్సి ఉన్నా భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది.
News November 11, 2025
ఇతిహాసాలు క్విజ్ – 63 సమాధానాలు

ప్రశ్న: కర్ణుడిని, పరశురాముడు ఎందుకు శపించాడు? ఏమని శపించాడు?
జవాబు: పరశురాముడు బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతాడు. కర్ణుడు తాను క్షత్రియుడైనప్పటికీ బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పి, శిష్యుడిగా చేరి రహస్య విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఓనాడు కర్ణుడి అసలు రూపం తెలియగానే ‘నువ్వు నా దగ్గర నేర్చుకున్న బ్రహ్మాస్త్రాది విద్యలన్నీ, నీకు అవసరమైన సమయంలో జ్ఞాపకం రాకుండా పోవుగాక!’ అని శపించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 11, 2025
వంటింటి చిట్కాలు

* రాగి, అల్యూమినియం పాత్రలను తోమేటప్పుడు సబ్బులో కాస్త వెనిగర్ కలిపితే కొత్తవాటిలా మెరుస్తాయి.
* దొండకాయలు, బెండకాయలు కోసేటప్పుడు చేతులకు నిమ్మరసం రాసుకుంటే వాటి జిగురు చేతులకు అంటుకోకుండా ఉంటుంది.
* కొత్తిమీర కాడల్ని కత్తిరించి నాలుగైదు వరుసల్లో కాగితాలు చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టండి.


