News February 27, 2026

ఏప్రిల్‌లో ఓటర్ల తుది జాబితా: కలెక్టర్ వెట్రిసెల్వి

image

జిల్లా ఓటర్ల తుది జాబితాను ఏప్రిల్‌లో ప్రచురించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం ఆమె అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎలక్టర్ మ్యాపింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లాలో సగటున 60.72 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, పెండింగ్‌లో ఉన్న 1,207 ఫారం- 6, 7, 8 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా చింతలపూడిలో అత్యధికంగా 69.11 శాతం మ్యాపింగ్ నమోదైంది.

Similar News

News February 28, 2026

అనంత: హాకీలో సత్తా చాటిన యువకుడు యువన్ క్రిష్

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన హాకీ టోర్నమెంట్‌లో యువకుడు యువన్ క్రిష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న యువన్ క్రిష్ అండర్ 10 హాకీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. భవిష్యత్తులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని పాఠశాల హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

News February 28, 2026

కాకినాడ విషాదం.. ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం

image

AP: కాకినాడ(D) వేట్లపాలెంలో జరిగిన భారీ <<19263594>>పేలుడు<<>> ఘటనలో 20 మంది మృతిచెందడంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని వేట్లపాలెంలో బాధితులను పరామర్శించిన అనంతరం తెలిపారు.

News February 28, 2026

భద్రాచలం: నవమి వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి!

image

భద్రాచలంలో మార్చి 27, 28 తేదీల్లో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణం, మహా పట్టాభిషేక ఉత్సవాలకు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.