News January 7, 2026

‘ఏప్రిల్‌లో వరంగల్ 24 అంతస్తుల ఆసుపత్రి ప్రారంభం’

image

వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూ.1100 కోట్లతో నిర్మించిన 24 అంతస్తుల ఆసుపత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ఏప్రిల్‌లో ప్రారంభించనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మార్చిలోగా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వరంగల్‌ను హెల్త్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.

Similar News

News January 8, 2026

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా

image

ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్‌లో మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈరోజు సాయంత్రం పిఠాపురం చేరుకోవాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన వాయిదా పడింది. రేపు ఉదయం ఆయన మంగళగిరి నుంచి రాజమండ్రికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం వస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. పర్యటన వాయిదా పడటంతో అధికారులు రేపటి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News January 8, 2026

ఇందిరమ్మ ఇండ్లకు రుణ సదుపాయం కల్పించాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం చేపట్టేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇల్లు నిర్మించుకునే పరిస్థితులు లేని లబ్ధిదారులకు రూ.లక్ష సహాయం అందించాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల ఖర్చులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిధుల సమస్య ఏమీలేదని, బిల్లులు అప్‌లోడ్ చేస్తే మంజూరవుతాయన్నారు.

News January 8, 2026

పాసుపుస్తకాలు పంపిణీ వేగవంతం చేయండి: జేసీ

image

రైతులకు పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లి నేరుగా పాసుపుస్తకాలు అందజేయాలన్నారు. అదే సమయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.