News February 11, 2026
ఏప్రిల్ నుంచి విశాఖ మెట్రో రైలు భూసేకరణ?

AP: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ భూసేకరణ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మెట్రో మార్గంలో నష్టపోయే నివాస, వ్యాపార ఆస్తులను గుర్తించే సర్వే దాదాపుగా పూర్తయింది. ఈ రూట్‌కు 99.2 ఎకరాల భూమి అవసరం కాగా ఎక్కువభాగం ప్రభుత్వానికి(87 ఎకరాలు) చెందినదే ఉంది. రోడ్డుకు అనుసంధానంగా మెట్రో వెళ్లేలా DPR రూపొందించగా ఢిల్లీ, హైదరాబాద్ తరహా నిర్మాణ విధానం అనుసరించనున్నారు.
Similar News
News February 12, 2026
HURLలో 40 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘నీలకంఠ’’

క్షీరసాగరాన్ని చిలికేటప్పుడు హాలాహలం ఉద్భవించింది. ఆ ప్రాణాంతక విషం నుంచి సృష్టిని రక్షించడానికి శివుడు దానిని స్వీకరించాడు. అయితే ఆ విషం కడుపులోకి వెళ్తే ఆయనలోని సకల జీవరాశికి ముప్పు కలుగుతుందని పార్వతీ దేవి ఆయన గంఠాన్ని గట్టిగా పట్టుకుంది. దీంతో ఆ విషం గొంతులోనే ఆగిపోయింది. అది నీలం రంగులోకి మారింది. లోక రక్షణ కోసం విషాన్ని సైతం భరించిన త్యాగమూర్తి కాబట్టే ఆయనకు ‘నీలకంఠుడు’ అనే పేరు వచ్చింది.
News February 12, 2026
ఇవాళ దేశవ్యాప్తంగా బంద్

కార్మిక చట్టాల స్థానంలో కొత్త లేబర్ చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలు కార్మిక సంఘాలు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చాయి. లేబర్ కోడ్‌లు తమ హక్కులను హరిస్తూ యాజమాన్యాలకు అధికారం కట్టబెడుతున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. బ్యాంకు యూనియన్లు మద్దతు తెలపడంతో బ్యాంకింగ్ సేవలకు కొన్ని గంటల పాటు అంతరాయం కలిగే అవకాశం ఉంది. స్కూళ్లు యథావిధిగా ఉండనున్నట్లు తెలుస్తోంది.


