News March 25, 2024
ఏప్రిల్ నెలాఖరులో నిసార్ ఉపగ్రహ ప్రయోగం

ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహ ప్రయోగం ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెలలోనే ఈ ప్రయోగం చేపట్టాల్సివుంది . అయితే ఉపగ్రహ రాడార్ యాంటెన్నా రిఫ్లెక్టర్ కు అదనపు పూత అవసరమని శాస్త్రవేత్తలు భావించడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఆ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రయోగం ఏప్రిల్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది.
Similar News
News November 3, 2025
నెల్లూరు: మా మొర ఆలకించండి సారూ..!

క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ప్రజలు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. అర్జీలు ఇస్తున్నారు తప్పితే అవి పరిష్కారం కావడానికి మరలా కిందిస్థాయికి వెళ్లాల్సి వస్తుంది. రామాయపట్నం పోర్టుకు భూములిచ్చిన ఓ రైతుకు ఇవ్వాల్సిన పరిహారం తన ఖాతాలో కాకుండా మరొక రైతు ఖాతాలో జమయిందని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కానీ ఆ సమస్య అలానే ఉండిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
News November 3, 2025
ఉద్యోగం ఇప్పిస్తానని రూ.45 లక్షల మోసం

డెన్మార్క్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని కొల్లూరు సుధాకర్ అనే వ్యక్తి రూ.45 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ దర్గామిట్టకు చెందిన ఓ బాధితుడు నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఉద్యోగం ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అవేదన వ్యక్తం చేశారు. విచారించి న్యాయం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News November 3, 2025
సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే తప్పా: కాకాణి

సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వెంకటాచలం మండలానికి చెందిన వైసీపీ నేత గోపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా అతడిని పరామర్శించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న గోపాల్ దంపతులపై విచక్షణరహితంగా దాడి చేసి, గోపాల్ గొంతు కోశారని కాకాణి ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకే టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన అన్నారు.


