News March 26, 2024
ఏప్రిల్ 1న ఇఫ్తార్ విందుకు సీఎం జగన్ రాక

రంజాన్ మాసం సందర్భంగా కదిరిలో ముస్లిం మైనార్టీల కోసం ఏప్రిల్ 1న ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన వేదికను పరిశీలించేందుకు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సోమవారం కదిరికి విచ్చేశారు. కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బూల్ అహ్మద్‌తో కలిసి కదిరి-మదనపల్లి రోడ్‌లోని పీవీఆర్ ఫంక్షన్ హాలును పరిశీలించారు.
Similar News
News February 4, 2026
అనంతపురంలో రూ.63 లక్షల CMRF చెక్కుల పంపిణీ

అనంతపురం ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం MLA దగ్గుపాటి ప్రసాద్ సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. 50 మంది బాధితులకు రూ.63 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఇప్పటి వరకు ఒక్క అనంతపురం నియోజకవర్గంలోనే 452 మందికి సుమారు రూ.5 కోట్ల ఆర్థిక సాయం అందించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
News February 4, 2026
ఈనెల 9 నుంచి FA-4 & ఫ్రీ ఫైనల్ పరీక్షలు: DEO

జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో DEO ప్రసాద్ బాబు మాట్లాడుతూ.. 1-9వ తరగతి వరకు FA-4 పరీక్షలు ఈనెల 9 నుంచి 12 వరకు జరుగుతాయన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఈనెల 9 నుంచి 19 వరకు జరుగుతాయన్నారు. ప్రశ్న పత్రాలను జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాల MRCలలో భద్రపరుస్తున్నామన్నారు.
News February 4, 2026
బెస్ట్ బ్యూటీషియన్ అవార్డు పొందిన అనంతపురం మహిళ

అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ బ్యూటీషియన్ హసీనా బేగం ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ బ్యూటీషియన్’ అవార్డును అందుకున్నారు. బెంగళూరులో కర్ణాటక బ్యూటీ పార్లర్ అసోసియేషన్ నిర్వహించిన బ్యూటెక్ ఎక్స్‌పోలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఎంతో గౌరవప్రదమైన, అనుకూలమైన ఈ వృత్తిలో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు.


