News February 28, 2025
ఏప్రిల్ 1 నాటికి మానాపురం ఫ్లైఓవర్ పూర్తి కావాలి: కలెక్టర్

మానాపురం ఫ్లైఓవర్ ఏప్రిల్ నాటికి ప్రారంభం అయ్యేలా పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన ఛాంబర్‌లో నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బి అధికారులు, కాంట్రాక్టర్‌లతో ఆర్.ఓ.బి పనులపై సమీక్షించారు. మార్చి లోపల మిగిలిన 18 శాతం పూర్తి చేసి ఏప్రిల్ 1 నాటికి ప్రారంభించడానికి సిద్ధం చేయాలనీ ఆదేశించారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
Similar News
News February 28, 2025
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: కిమిడి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యంగా ఉందన్నారు. రాష్ట్రం పూర్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. రూ.3,22,359 కోట్లతో ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసి, స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసిందన్నారు.
News February 28, 2025
NDPS కేసుల్లో హిస్టరీ సీట్లు తెరవాలి: SP

విజయనగరం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో నిందితులకు హిస్టరీ సీట్లు తెరవాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియా కేసులపై దృష్టి సారించాలని సూచించారు.
News February 28, 2025
రెండు రోజుల్లో 24 మందిపై కేసు: VZM ఎస్పీ

విజయనగరం సిటీ పరిధిలోని రెండు రోజుల్లో 24 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. పట్టణంలో పట్టుబడిన నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ రూ.10 వేలు చొప్పున మొత్తం రూ. 2.40 లక్షల జరిమానా విధించారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.