News March 31, 2026
ఏప్రిల్ 2న ‘రామాయణ’ పాత్రల ఫస్ట్ లుక్?

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘రామాయణ’లోని పాత్రల ఫస్ట్ లుక్‌ను ఏప్రిల్ 2న మూవీ టీమ్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. హనుమాన్ జయంతి సందర్భంగా పాత్రల లుక్స్‌పై స్పెషల్ గ్లింప్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. రామాయణ తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Similar News
News April 13, 2026
బేబీ మసాజ్‌కు ఈ ఆయిల్స్ ఉపయోగిస్తే మంచిది

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.
News April 13, 2026
భారత్ చేరుకున్న ఇరాన్ నౌకలు

పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ చమురు నౌకలు రెండు భారత్ చేరుకున్నాయి. గుజరాత్‌లోని సిక్కా పోర్టులో ఇవి లంగరేసినట్లు షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. దీంతో ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు వచ్చినట్లయింది. సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో మార్చి రెండో వారంలో ఈ రెండు నౌకలు ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరాయి.
News April 13, 2026
కొవిడ్ వ్యాక్సిన్.. చావు అంచుకు వెళ్లొచ్చానన్న మస్క్

జర్మనీలో సంభవించిన పది వేలకు పైగా మరణాలకు mRNA వ్యాక్సిన్ కారణమై ఉండొచ్చని ఫైజర్ మాజీ టాక్సికాలజిస్ట్ డాక్టర్ హెల్ముట్ వెల్లడించారు. ఈ వాదనను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సమర్థించారు. ‘టీకా డోసేజ్ కచ్చితంగా ఎక్కువగా ఉంది. దాన్ని చాలా సార్లు ప్రజలకు వేశారు. వ్యాక్సిన్ రాకముందు నాకు వైరస్ సోకింది. కానీ భయంకరంగా లేదు. అయితే రెండో టీకా తీసుకున్నప్పుడు నేను చనిపోతున్నట్లుగా అనిపించింది’ అని పేర్కొన్నారు.


