News March 20, 2024
ఏప్రిల్ 25 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి జరగనున్నాయని డీఈఓ సోమశేఖరశర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 3నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు.
Similar News
News August 16, 2025
మున్నేరు వరద పరివాహక ప్రాంతంలో వాలంటీర్ల నియామకం…!

మున్నేరు వరద ఉధృతి నేపథ్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, వార్డు అధికారులు, వాలంటీర్లను నియమించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు వారికి సూచించారు. ప్రతి ఒక్కరూ తమ విధులను కేవలం బాధ్యతగా కాకుండా, పౌర సేవగా భావించాలని కోరారు.
News August 16, 2025
ఖమ్మం జిల్లాలో 579.9 MM వర్షపాతం నమోదు

ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో మొత్తం 579.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. కొనిజర్లలో అత్యధికంగా 70.9 మి.మీ, ఎర్రుపాలెం మండలంలో అసలు వర్షపాతం నమోదు కాలేదని సింగరేణి 61.4 మి.మీ, వైరా 55.4 మి.మీ, కుసుమాంచి 47.8 మి.మీ, కామేపల్లి 46.7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News August 16, 2025
నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలి: ఖమ్మం అ.కలెక్టర్

పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం పాలేరు రిజర్వాయర్‌ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ, ఇన్ ఫ్లో ఎంత, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఎంత, తదితర వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు.