News February 27, 2026

ఏయూలో మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై కఠిన చర్యలు: లోకేశ్

image

గత ప్రభుత్వంలో ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో మండిపడ్డారు. వర్సిటీలో అక్రమ నియామకాలపై మ్యాన్ పవర్ ఆడిట్ చేస్తున్నామని, నెల రోజుల్లో అనర్హులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆడిట్ తర్వాతే కాంట్రాక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరణపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విజిలెన్స్ నివేదిక రాగానే కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News March 3, 2026

మార్చి 4న కొత్తవలసలో ఒడిశా గవర్నర్ పర్యటన

image

ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు మార్చి 4వ తేదీన కొత్తవలస మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్, హాస్పిటల్‌ను ఆయన సందర్శించనున్నారు. ఈ మేరకు గవర్నర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.

News March 3, 2026

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి టీడీపీ హెల్ప్ లైన్

image

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారి రక్షణ కోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను (95500 57623, 79978 26882) ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ద్వారా బాధితులకు వసతి, ఆహారం, భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ, ప్రతి తెలుగు వానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

News March 3, 2026

పార్వతిపురం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 14 అర్జీలు

image

పార్వతీపురం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి సోమవారం పీజిఆర్ఎస్ నిర్వహించి 14 అర్జీలను స్వీకరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ అర్జీలను అందజేశారు. ఎస్పీ నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలు వాస్తవాలు అయినట్లయితే, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి నివేదికను కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు.