News December 2, 2025
ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు నోటిఫికేషన్

ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారి టి.చిట్టిబాబు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2010-11 సంవత్సరం నుంచి 2025 వరకు డిగ్రీ, పీజీ ప్రవేశం పొందిన విద్యార్థులు స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు అర్హులుగా ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 4 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
Similar News
News April 14, 2026
శ్రీవారి సంపదకు రక్షకులు ఎవరో తెలుసా?

శ్రీవారి ఆలయంలోని నిధులు, సంపదలను రక్షించడానికి ప్రత్యేకంగా ఇద్దరు దేవతలు ఉన్నారు. వారే శంఖనిధి, పద్మనిధి. వీరి విగ్రహాలు ఆలయ మహద్వారానికి ఇరువైపులా దర్శనమిస్తాయి. మనం క్యూలో లోపలికి వెళ్లేటప్పుడు ద్వారపాలకుల్లా కనిపించేది వీరే. ఈ విగ్రహాలు దాదాపు రెండడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. వీటిని పంచ లోహాలతో తయారు చేశారు. ఈ దేవతలు శ్రీవారి ధనాన్ని కాపాడే ముఖ్యమైన రక్షకులుగా భక్తులు భావిస్తారు.
News April 14, 2026
పరికరాల పేరుతో ఆన్‌లైన్ మోసం

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా డెంటల్ పరికరాల విక్రయం పేరుతో ఓ మహిళా వైద్యురాలిని మోసం చేసిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. నగరంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఆమె, ఓ యాప్ ద్వారా పరికరాలు ఆర్డర్ చేసి నగదు చెల్లించారు. ఎంతకీ వస్తువులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సోమవారం ఖానాపురం హవేలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 14, 2026
గృహ ప్రవేశ సమయంలో గోవు ఎందుకు?

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంటి నిర్మాణంలో తెలియక చేసిన దోషాలను తొలగించడానికి గోమాతను ఇంట్లోకి తీసుకువస్తారు. గోవు అంటే లక్ష్మీదేవి స్వరూపం. పవిత్రతకు నిలయంగా కూడా భావిస్తారు. గోమూత్రం, గోమయం పవిత్రమైనవి. గోవు ప్రవేశంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే గోవు పాలు, పెరుగు వంటివి వాడటం వలన శరీరానికి, మనసుకు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.


