News September 27, 2025
ఏయూ: అక్టోబర్ 3న PHD ప్రవేశాలకు ఇంటర్వ్యూలు

ఏయూలో వివిధ కోర్సుల్లో PHD ప్రవేశాలకు సంబంధించి UGC నెట్, CSIR నెట్, గేట్, తదితర జాతీయస్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్యూలు నిర్వహించనున్నట్లు ప్రవేశాల సంచాలకుడు డీ.ఏ.నాయుడు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో అక్టోబర్ 3వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు.
Similar News
News September 27, 2025
విశాఖలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రూజ్ కలనరీ అకాడమీ (సీసీఎ) ఆధ్వర్యంలో ఆర్కేబీచ్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏపీ పర్యాటక జిల్లా అధికారి మాధవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ టూరిజం హబ్‌గా మారనుందని ఆమె పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని సంస్థ డైరెక్టర్లు పేర్కొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
News September 27, 2025
ఏయూ: న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

ఏయూలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ న్యాయ కళాశాలలో వివిధ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంచినట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య డిజే.నాయుడు తెలిపారు. ఐదేళ్ల న్యాయవిద్య, మూడేళ్ల న్యాయవిద్య, 2 సంవత్సరాల పీజీ ఎల్ఎల్ఎం కోర్సులను సెల్ఫ్ సపోర్ట్ విధానంలో దరఖాస్తు చేసేందుకు అక్టోబర్ 9వ తేదీ వరకు గడువు పొడిగించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
News September 27, 2025
సంతానలక్ష్మి అవతారంలో కనుమహాలక్ష్మి అమ్మవారు

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం అమ్మవారు సంతాన లక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వేకువజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కలువ పువ్వులతో సహస్రనామార్చన చేపట్టారు. ఈవో శోభారాణి భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.