News September 29, 2024
ఏయూ: ‘అక్టోబర్ 7 నుంచి దసరా సెలవులు’
ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Similar News
News November 24, 2024
విజయనగరంలో టుడే టాప్ న్యూస్
➤విజయనగరం-కోరుకొండ మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి ➤విజయనగరంలో భారీగా పట్టుబడ్డ నిషేధిత ప్లాస్టిక్ ➤జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ ➤తహసీల్దార్ కార్యాలయాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ప్రచురణ ➤అదానీ అరెస్ట్ చేయాలని ఉమ్మడి జిల్లాలో సీపీఐ, సీపీఎం నేతల నిరసన ➤విజయనగరంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు➤జిల్లాలో 3,425 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు
News November 23, 2024
డిసెంబర్ 9లోగా క్లెయిమ్ చేసుకోవాలి: కలెక్టర్ అంబేడ్కర్
ఉత్తరాంధ్రా ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితాలో క్లెయిమ్స్, అభ్యంతరాలను డిసెంబర్ నెల 9 లోగా సమర్పించవలసి ఉంటుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి డ్రాఫ్ట్ రోల్ ప్రచురణ నవంబర్ 23న జరుగుతుందని, డిసెంబర్ 9 లోగా క్లెయిమ్స్ , అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
News November 23, 2024
VZM: సంక్రాంతి నాటికి జిల్లాలో గుంతలు లేని రోడ్లు
విజయనగరం జిల్లాకు 176 రోడ్ల పనులు మంజూరయ్యాయి. రూ.23.51 కోట్లతో ఈ పనులను R&B శాఖ చేపడుతుంది. ఇందులో భాగంగా 750 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు జరగనున్నాయి. తొలివిడతలో 68 పనులకు రూ.10.54 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటిలో ఇప్పటికే 61 పనులకు టెండర్లు ఖరారయ్యాయి. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.