News December 27, 2025

ఏయూ మైదానంలో ప్రారంభమైన శ్రామిక ఉత్సవ్

image

బీచ్ రోడ్‌లోని ఏయు ఎగ్జిబిషన్ మైదానంలోని అఖిలభారత జాతీయ మహాసభలతో పాటు శ్రామిక ఉత్సవ్ కార్యక్రమాన్ని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రారంభించారు. వచ్చి నెల 2వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవం కార్యక్రమంలో పలు సాంకేతిక ప్రదర్శనలు జాతీయస్థాయి ప్రముఖులు పాల్గొన్నారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి నరసింగరావు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మురళి హాజరు అయ్యారు. మొదటి రోజు కార్యక్రమంలో పుస్తక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Similar News

News December 28, 2025

విశాఖలో వార్షిక నేర సమీక్షా సమావేశం

image

విశాఖ నగరం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో ‘వార్షిక నేర సమీక్ష–2025’ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు పాల్గొని సమర్థవంతమైన పోలీసింగ్‌కు పలు సూచనలు చేశారు. నగరంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్, క్రైమ్ అంశాలపై సీపీ సమీక్షించి, వచ్చే ఏడాదికి దిశానిర్దేశం చేశారు.

News December 27, 2025

విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు డీజీగా పదోన్నతి

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న శంఖబత్ర బాగ్చీకి డీజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కే.విజయానంద్ శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. 1996 బ్యాచ్‌కి చెందిన పోలీస్ కమిషనర్ పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసే విశాఖ నగరంలో పోలీస్ కమిషనర్‌గా సేవలందిస్తున్నారు. కమిషనర్ రాకతో పోలీసుల సంక్షేమానికి అభివృద్ధికి ప్రజోపకార పనులు చేశారు.

News December 27, 2025

భీమిలికి పెరుగుతున్న వలసలు?

image

విశాఖ తీరానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతుంటే, వలసదారులు అక్కడే వాలుతున్నాయి. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, IT పురోగతి పెరగడం మైగ్రేషన్‌ను పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో 1,2 స్థానాల్లో భీమిలి, గాజువాకలు నిలిచాయి.ప్రస్తుతం భీమిలిలో 3,66,256 మంది ఓటర్లు ఉన్నారు. భీమిలి నియోజకవర్గంలో సగం అర్బన్, సగం గ్రామీణ వాతావరణం ఉంటుంది.