News October 8, 2025

ఏయూ స్నాతకోత్సవం వాయిదా

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వాయిదా పడిందని రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ప్రకటన జారీ చేశారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం 91, 92 సంయుక్త స్నాతకోత్సవం జరగాల్సి ఉంది. ఈ స్నాతకోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని రిజిస్ట్రార్ తెలిపారు.

Similar News

News October 8, 2025

సంగారెడ్డి: రేపటి నుంచి మూల్యాంకనం ప్రారంభం

image

జిల్లాలో గత నెలలో జరిగిన ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం రేపటి నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశామని అన్నారు.

News October 8, 2025

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్

image

కెమిస్ట్రీ విభాగంలో ముగ్గురిని ప్రఖ్యాత నోబెల్-2025 బహుమతి వరించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ డెవలప్ చేసినందుకు గాను సుసుము కటీగవా(జపాన్), రిచర్డ్ రాబ్సన్(ఆస్ట్రేలియా), ఒమర్ ఎం.యాగీ(అమెరికా)ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఇప్పటివరకు <<17929651>>మెడిసిన్<<>>, <<17939496>>ఫిజిక్స్<<>> విభాగాల్లో బహుమతులు ప్రకటించింది. ఇంకా లిటరేచర్, ఎకనామిక్ సైన్స్, పీస్ విభాగాల్లో ప్రైజ్‌లు ప్రకటించాల్సి ఉంది.

News October 8, 2025

SRCL: దినసరి కూలీ అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పదంగా ఓ దినసరి కూలీ మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కూడెల్లి పరశురాములు(35) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం ఎప్పటిలాగే ఓ ఇంటి నిర్మాణపనికి వెళ్లాడు. అకస్మాత్తుగా కిందపడి స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.