News October 27, 2025
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న… పాట రాసింది మన కొసరాజు అన్న

సుప్రసిద్ధ కవి, రచయిత, తెలుగు సినిమా పాటల రచయితగా పేరుపొందిన కొసరాజుగా పేరొందిన కొసరాజు రాఘవయ్య (జూన్ 23, 1905-అక్టోబర్ 27, 1986) కర్లపాలెం మండలం చింతాయపాలెంలో జన్మించారు. తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేకపీఠం. ఏరువాక సాగారో రన్నో, రామయతండ్రి ఓ రామయ తండ్రి పాటల్లో తన ముద్ర కనిపిస్తుంది. హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినది ఆయనే, ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నారు.
Similar News
News October 27, 2025
మంచిర్యాల: చికిత్స పొందుతూ యువకుడి మృతి

మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి మండలంలో జరిగింది. SI తహిసీనోద్దీన్ ప్రకారం.. గుడిరేవుకు చెందిన అన్వేష్(22) డిగ్రీ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో టూర్‌కి వెళ్లడానికి తండ్రిని డబ్బులు అడగగా లేవని మందలించాడు. మనస్తాపం చెందిన అన్వేష్ ఈనెల 11న పురుగుమందు తాగి స్టేటస్ పెట్టాడు. ఇది చూసిన స్నేహితులు తండ్రికి సమాచారం అందించగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.
News October 27, 2025
మెుంథా తుఫాన్ ఇంకా ఎంత దూరం ఉందంటే.!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుందని APSDMA తెలిపింది. ఇది చెన్నైకి 640 కి.మీ, విశాఖపట్నానికి 740 కి.మీ, కాకినాడకు 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
News October 27, 2025
పిట్లం: తండ్రికి కల్లులో విషం.. కొడుకు ఘాతుకం..!

వృద్ధుడైన తండ్రికి సేవ చేయడం భారంగా భావించిన ఆ కొడుకు.. తండ్రి తాగే కల్లులో విషం కలిపి హత్య చేశాడు. ఈ ఘటన పిట్లం(M) గౌరారం తండాలో శుక్రవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SI వెంకట్రావ్ ప్రకారం.. తండావాసి దశరథ్ కొడుకు వామన్ వద్దుంటున్నాడు. తండ్రికి వృద్ధాప్య సేవలు చేయలేక వామన్ కల్లులో విషం కలిపి ఇచ్చి హతమార్చాడు. కేసు నమోదు చేసి, నిందితుడైన వామన్‌ను ఆదివారం రిమాండ్‌కు తరలించారు


