News December 22, 2025

ఏరో స్పేస్ రంగంలో విస్తృత అవకాశాలు: ప్రో. రాములు

image

తెలంగాణ విమానయాన తయారీ రంగంలో వృత్తి నైపుణ్యత పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని అమెరికాలోని బోయింగ్ విమాన తయారీ సంస్థ శాస్త్రవేత్త, పరిశోధన విభాగ అధిపతి ప్రో.మామిడాల రాములు పేర్కొన్నారు. ఏరో స్పేస్ రంగ నిపుణులకు వృత్తి, ఉపాధి కల్పన రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని CSTD డిజిటల్ క్లాస్‌రూమ్‌లో ముఖాముఖి చర్చలో రాములు పాల్గొన్నారు.

Similar News

News December 29, 2025

HYD‌లో భారీ అగ్ని ప్రమాదం.. ‘@2వేలు’

image

ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో సుమారు 2,000కి పైగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరతతో సహాయక చర్యలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. వాహనాలు, పరికరాల కొరత కూడా సమస్యగా మారింది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News December 29, 2025

HYD: మీ పిల్లలు మాంజా వాడుతున్నారా? జర జాగ్రత్త!

image

చైనా మాంజాతో పాటు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన వివిధ రకాల మాంజాలతో ప్రమాదం పొంచి ఉంది. మాంజా ఎదుటివారికే కాదు పతంగి ఎగరేసే కుటుంబసభ్యులకూ డేంజర్ డేంజర్ అని గుర్తించాలి. కీసరలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి మాంజాతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కొందరు వ్యాపారులు సంక్రాంతికి నిషేధిత మాంజా అమ్ముతున్నారు. అందరూ బాధ్యతగా భావించి ప్రమాదపు దారాలు అమ్మితే దగ్గరలోని PSలో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

News December 28, 2025

HYD‌: ఐటీ హబ్‌లో Monday Blues!

image

IT కారిడార్లలో ఇప్పుడు ‘మండే బ్లూస్’ సరికొత్త రూపం దాల్చాయి. సండే నైట్ నుంచే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ‘సోమవారం భయం’ వెంటాడుతోంది. ‘బేర్ మినిమమ్ మండే’ పేరుతో కేవలం లాగిన్ అయ్యామనిపించడం, మీటింగ్‌లో కెమెరాలు ఆపేయడం, అత్యవసరమైతే తప్ప పని ముట్టుకోకపోవడం ఫ్యాషన్‌గా మారింది. కార్పొరేట్ కొలువుల్లో ఈ సోమరితనం మానసిక ప్రశాంతతా? లేక బాధ్యతారాహిత్యమా? అన్న చర్చ మొదలైంది. ​ఈ ‘మండే సిండ్రోమ్’ మీ ఆఫీసులోనూ ఉందా?