News May 10, 2024
ఏర్పేడులో రాజ్యసభ ఎంపీపై రాయితో దాడి

బీసీ నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్యపై రాయితో దాడి చేశారు. శ్రీకాళహస్తి MLA మధుసూదన్ రెడ్డి, కృష్ణయ్య నిన్న రాత్రి ఏర్పేడులో రోడ్ షో నిర్వహించారు. ఈక్రమంలో ఎవరో విసిరిన రాయి ఎంపీ వీపునకు తగిలింది. అప్రమత్తమైన వైసీపీ కార్యకర్తలు ఎస్ఐ జిలానీకి ఫిర్యాదు చేశారు. తనపై బీసీలు దాడి చేయరని.. ఇది టీడీపీ కుట్రేనని ఎంపీ ఆరోపించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.
Similar News
News October 24, 2025
పౌల్ట్రీ రంగ రైతులతో కలెక్టర్ సమీక్ష

కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని పౌల్ట్రీ రంగం రైతులు, కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధికి రైతులు, కంపెనీలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. రైతులకు ప్రభుత్వం తరఫున సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తామని వివరించారు. రైతులకు కంపెనీలు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రాయితీల సక్రమంగా అందించేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
News October 24, 2025
చిత్తూరు జిల్లాలో 177 ఎకరాలలో దెబ్బతిన్న వరి పంట

వర్షాల కారణంగా జిల్లాలో 177 ఎకరాల్లోని వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖాధికారులు తెలిపారు. 12 మండలాల పరిధిలోని 32 గ్రామాల్లో 172 మంది రైతులు సాగు చేసిన వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అత్యధికంగా పెనుమూరు మండలంలో 70 ఎకరాల్లో పైరు దెబ్బతినగా, చౌడేపల్లె మండలంలోని ఒకే గ్రామంలో 40 ఎకరాలు, యాదమరి మండలంలోని ఐదు గ్రామాల్లో 12.25 ఎకరాలు సాగు చేసిన వరి పైరు దెబ్బతింది.
News October 24, 2025
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో బంగారుపాళ్యం మినహా 31 మండలాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిండ్రలో 83.4 మిమీ, అత్యల్పంగా పెద్దపంజాణిలో 2.6 మిమీ వర్షపాతం నమోదయ్యింది. మండలాల వారీగా కుప్పంలో 35.2, విజయపురంలో 34.4, నగరిలో 28.8, శ్రీరంగరాజపురంలో 26.8, పాలసముద్రంలో 26.6, గుడుపల్లెలో 23.6, సోమలలో 14.6 మీ. మీ వర్షపాతం నమోదు అయింది.


