News July 9, 2024
ఏర్పేడు: 10న KVలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

ఏర్పేడు ఐఐటి ప్రాంగణంలోని కేంద్రీయ విద్యాలయం (kV)లో 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు 10న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రకటించారు. ప్రైమరీ టీచర్స్, స్పోర్ట్స్ కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
Similar News
News December 21, 2025
TDP చిత్తూరు జిల్లా బాస్ ఎవరంటే..?

TDP చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వై.సునీల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. పుత్తూరుకు చెందిన షణ్ముగ రెడ్డిది వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం. గతంలో జిల్లా అధ్యక్షుడిగా CRరాజన్ పనిచేశారు. ప్రస్తుతం అదే సామాజికవర్గానికి చెందిన షణ్ముగ రెడ్డికి అవకాశమిచ్చారు. తిరుపతి జిల్లా అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్ రెడ్డి నియమితులయ్యారు.
News December 21, 2025
చిత్తూరు: ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు

పీఎం ఆవాస యోజనలో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. పుంగనూరు నియోజకవర్గంలో 6,485, చిత్తూరులో 1,628, నగరిలో 2,331, పూతలపట్టులో 5,035, జీడీ నెల్లూరులో 5,930, కుప్పంలో 13,657, పలమనేరులో 15,391 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇందులో సుమారు 8వేల మంది ఇంటి స్థలాలను కూడా మంజూరు చేయాలని కోరారు.
News December 21, 2025
రేపే చిత్తూరులో లీప్ టీచర్స్ టోర్నీ

చిత్తూరు మోసానికల్ మైదానంలో ఈనెల 22న లీప్ టీచర్స్ టోర్నమెంట్ నిర్వహిస్తామని డీఈవో రాజేంద్రప్రసాద్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ బాబు తెలిపారు. ఇందులో భాగంగా క్రికెట్ పోటీల్లో పురుషుల విభాగంలో పలమనేరు, చిత్తూరు, కుప్పం, నగరి, త్రోబాల్ మహిళా విభాగంలో కుప్పం, నగరి, పలమనేరు, చిత్తూరు జట్లు పాల్గొంటాయని చెప్పారు.


