News February 14, 2025

ఏర్పేడు: JRFకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్ -02 (JRF) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఐదు సంవత్సరాల ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్, ఎమ్మెస్సీ ఇన్ ఫిజిక్స్, ఎమ్మెస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iittp.ac.in వెబ్ సైట్ చూడాని పేర్కొంది.

Similar News

News February 25, 2026

HYD: షీ టీమ్స్ అదుపులో 264 మంది పోకిరీలు

image

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో షీ టీమ్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేసి 264 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, 52 మందికి కోర్టు రూ.1,050 జరిమానా విధించింది. మరో నలుగురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. 188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.

News February 25, 2026

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలపై కీలక ప్రకటన

image

AP: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై మంత్రి DBV స్వామి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. నెలకు రూ.10వేల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే పథకాలు వర్తించవని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.20 లక్షలు, పట్టణాల్లో రూ.1.44 లక్షలు ఆదాయం మించి ఉంటే పథకాలకు అనర్హులు అని పేర్కొన్నారు.

News February 25, 2026

‘జెన్ జీ’ వల్ల రూ.76లక్షల కోట్లు నష్టం!

image

ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ పరిశ్రమ నాలుగేళ్లలో 839 బిలియన్ డాలర్ల(రూ.76లక్షల కోట్లు) మార్కెట్ విలువను కోల్పోయింది. దీనికి కారణం <<17942790>>‘జెన్ జీ’<<>> యువతలో వస్తున్న జీవనశైలి మార్పులేనని పలు నివేదికలు చెబుతున్నాయి. మునుపటి తరాలతో పోలిస్తే జెన్‌ జీలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తూ మద్యానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆల్కహాల్ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతోంది.