News August 11, 2024
ఏలూరులో ఇంటర్ విద్యార్థినికి ప్రేమ పేరిట వేధింపులు

ఇంటర్ విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాపులపాడు మండలం వేలేరుకు చెందిన యువతి ఏలూరులోని ఓ కాలేజ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈమెను అదే విలేజ్‌కి చెందిన శ్రీరామ్ నాయక్ కొద్దిరోజులుగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి ఆమె తల్లికి చెప్పడంతో శనివారం రాత్రి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీరామ్‌పై పోక్సో కేసు నమోదైంది.
Similar News
News January 23, 2026
నరసాపురం: ‘తాబేళ్ల సంరక్షణకు చర్యలు’

తీర ప్రాంత గ్రామాల్లో సముద్ర పర్యావరణ పరిరక్షణకు దోహదపడే తాబేళ్లను సంరక్షించేందుకు, వాటి సంతతిని పెంచేందుకు అటవీ శాఖా పరంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా అటవీశాఖ అధికారి డీఏ కిరణ్ తెలిపారు. గురువారం పీఎం లంక, కేపీపాలెం సముద్ర తీరంలో తాబేళ్ల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చి విలేకరులతో మాట్లాడారు.
News January 22, 2026
రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్ నాగరాణి

ఉద్యానవన పంటలలో సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు లాభాలను గడించాలని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. తణుకు మండలం యర్రాయి చెరువు గ్రామంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు పండించేందుకు రూ.1.40 కోట్లు వ్యయంతో ఏర్పాటుచేసిన హైడ్రోపోనిక్ యూనిట్ గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. జిల్లాలో అభ్యుదయ రైతులు హైడ్రోపోనిక్ యూనిట్స్ ఏర్పాటుకు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
News January 22, 2026
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: ఎస్పీ

సాంకేతికతను వినియోగించుకుంటూ సమన్వయంతో పని చేసి పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ నయీం అస్మి అన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు రాజీపడేది లేదని అన్నారు. గురువారం ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాలోని డీఎస్పీ, సీఐలతో నేర సమీక్షను నిర్వహించారు. 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన నేరాల దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచాలన్నారు.


