News February 6, 2025
ఏలూరులో ఒక్కే ఒక్క నామినేషన్
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో బుధవారం భీమడోలుకు చెందిన బాలాజీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు కలెక్టరేట్లో ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె.వెట్రిసెల్వికి ఓ సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభ్యర్ధి బాలాజీతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు.
Similar News
News February 6, 2025
దరఖాస్తు గడువు పెంపు
AP: రాష్ట్రంలో గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు ఎక్సైజ్ శాఖ పొడిగించింది. ఈ నెల 10న డ్రా తీసి లబ్ధిదారుల పేర్లను కలెక్టర్లు ప్రకటిస్తారని వెల్లడించింది. రాష్ట్రంలోని 340 మద్యం దుకాణాలను ప్రభుత్వం గీత కార్మికులకు కేటాయించిన విషయం తెలిసిందే.
News February 6, 2025
MNCL: ఏఐటీయూసీ కృషితోనే వయోపరిమితి పెంపు
సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కృషితోనే కారుణ్య నియామకాల ఉద్యోగ వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. కార్మికుడు మరణించిన లేదా మెడికల్ ఇన్వాల్యుడేషన్ అయిన వారసుడికి 40 సంవత్సరాల వయసు ఉన్న ఉద్యోగం ఇస్తారని పేర్కొన్నారు.
News February 6, 2025
పెద్దపల్లిలో బాలికల బాలసదనం ప్రారంభం
పెద్దపల్లి జిల్లాలోని అనాథ బాలికలకు ప్రభుత్వం బాల సదనం ప్రారంభించిందని వయోవృద్ధుల శాఖ అధికారి పి.వేణుగోపాలరావు తెలిపారు. 6 నుంచి 18 సంవత్సరాల వయస్సులోపు అనాథ బాలికలను అడ్మిషన్ చేసుకుంటామని తెలిపారు. ఉచిత వసతి, విద్య అందిస్తామని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివించి వివాహం కూడా జరిపిస్తామని తెలిపారు.