News February 2, 2026
ఏలూరులో కొర్ల బండి ఊరేగింపు రూట్ మ్యాప్ ఇదే

ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించే కొర్ల బండి ఊరేగింపు మార్గాన్ని పోలీసులు ప్రకటించారు. ఈ బండి పడమర వీధి నుంచి ప్రారంభమై గడియార స్తంభం, బిర్లా భవన్, రామకోటి, గాంధీ మైదానం, జూట్ మిల్, పాత బస్టాండ్, అల్లూరి సీతారామరాజు స్టేడియం మీదుగా ఆశ్రమ ఆసుపత్రి రోడ్డు వద్ద ముగుస్తుంది. భక్తులు, వాహనదారులు ఈ రూట్‌మ్యాప్‌ను అనుసరించాలని అధికారులు సూచించారు.
Similar News
News February 14, 2026
282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CSC ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో TGలో 10, APలో 7 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cscspv.in
News February 14, 2026
చిత్తూరు జిల్లా నేతలతో లోకేశ్ సమావేశం

చిత్తూరు జిల్లాకు సంబంధించిన MP, MLA లు, MLCలతో మంత్రి లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అదే విధంగా జిల్లా రాజకీయాలపై మంత్రి చర్చించినట్లు సమాచారం.
News February 14, 2026
HYD విశాఖ వెళ్లేవారికి గమనిక.. టైమింగ్ ఛేంజ్

సిటీ నుంచి వైజాగ్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లింగంపల్లి నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు రెగ్యులర్‌గా నడుస్తోంది. లింగంపల్లి- విశాఖ (12806) ఉ.6:55 గం.కు బయలుదేరి విశాఖకు రాత్రి 7:50కు చేరుకుంటుంది. విశాఖ- లింగంపల్లి (12805) రైలు విశాఖలో 6:20 గం.కు బయలుదేరి లింగంపల్లికి రాత్రి 7:15 గం.కు చేరుకుంటుంది. ఈ మార్పులు రేపటి నుంచి అమలవుతాయి.


