News October 8, 2025

ఏలూరులో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపికలు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అండర్-14, 17 బాలబాలికల జిల్లా స్థాయి క్రీడా పోటీల ఎంపికలు ఈనెల 10న జరుగుతాయని SGF సెక్రటరీ కె. అలివేలుమంగ తెలిపారు. బాస్కెట్‌బాల్ కొవ్వలిలో, వ్రేస్లింగ్ ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరుగుతాయన్నారు. పాల్గొనేవారు ఉదయం 9 గంటలకు ఎంట్రీ ఫారమ్, క్రీడా దుస్తులతో హాజరుకావాలన్నారు.

Similar News

News October 8, 2025

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. జిల్లాలో తరచుగా వర్షాలు కురుస్తున్నాయని, వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ప్రజలు తమ చుట్టుప్రక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీటిని వేడి చేసి తాగాలని సూచించారు. ప్రతినిత్యం చేతులను సబ్బుతో కడుక్కోవాలన్నారు.

News October 8, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌లో అమ్రిత్ సంవాద్ కార్యక్రమం

image

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో బుధవారం వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారి ‘అమ్రిత్ సంవాద్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం పవన్ కుమార్ ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సూచనలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రయాణికులు ఎస్కలేటర్ వద్ద వృద్ధుల కోసం కేర్ టేకర్, రైలులో మగ, ఆడవాళ్లకి వేర్వేరుగా బాత్రూం ఏర్పాటు చేయాలని సూచించారు.

News October 8, 2025

VZM: ‘వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ’

image

జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ ఎస్.రాంసుందర్‌ రెడ్డి ఆదేశించారు. విద్యాశాఖ వివిధ విభాగాల అధికారులతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫెరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు వేడి నీరు, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, ప్రతిరోజూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.