News July 9, 2025
ఏలూరులో పురుగు మందు తాగి వృద్ధురాలి ఆత్మహత్య

అనారోగ్య కారణాలతో మనస్తాపం చెంది వృద్ధురాలు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దెందులూరు మండలం మలకచర్లలో చేసుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సీతమ్మ (60) భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి జీవిస్తుంది. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతూ మంగళవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
Similar News
News July 9, 2025
‘కాంతార ప్రీక్వెల్’ కోసం రిషబ్‌కు రూ.100 కోట్లు?

హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ‘హొంబలే ఫిల్మ్స్’ ₹15 కోట్లతో రూపొందిస్తే ₹400 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ చిత్రానికి రిషబ్ ₹4కోట్లు మాత్రమే ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కాంతార ప్రీక్వెల్’పై భారీ అంచనాలు ఉండటంతో రిషబ్ తన పారితోషికాన్ని భారీగా పెంచి ₹100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.
News July 9, 2025
SRSPలో తగ్గిన వరద నీటి ప్రవాహం

మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు కురవక పోవటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్ ఫ్లో రావడం లేదు. గడిచిన 24 గంటల్లో కేవలం 4291 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80TMCలు) కాగా, ప్రస్తుతం 1067 అడుగులు (19.537 TMCలు) మాత్రమే నీటి నిల్వ ఉంది. బాబ్లీ గేట్లు ఎత్తినా ఇప్పటి వరకు కేవలం 8.857 TMCల నీరు మాత్రమే వచ్చి చేరింది.
News July 9, 2025
భారత నేవీలో 1,040 పోస్టులు

భారత నేవీలోని పలు విభాగాల్లో 1,040 గ్రూప్-బీ, సీ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 18 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, PH, మహిళలు మినహా మిగతావారికి రూ.295గా ఉంది. రాతపరీక్షతో పాటు పలు పోస్టులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. పూర్తి వివరాల PDF కోసం ఇక్కడ <