News March 8, 2025

ఏలూరులో మంత్రి నాదెండ్ల పర్యటన

image

ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో స్త్రీ, పురుషుల కోసం విశ్రాంతి బ్యారక్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అనంతరం విశ్రాంతి బ్యారక్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మహేశ్, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 16, 2026

వరంగల్: కోల్డ్ స్టోరేజ్ నుంచి గ్యాస్ లికేజీ

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్ సమీపంలోని ఒక కోల్డ్ స్టోరేజీ నుంచి అమోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ నగర్, సుందరయ్య నగర్ తదితర కాలనీవాసులు కంటి మంటలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులతో భయాందోళనకు గురయ్యారు. బాధితులు ఆందోళన చేయడంతో నిర్వాహకులు వెంటనే లీకేజీని అరికట్టారు. గ్యాస్ ప్రభావం తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తప్పడంతో అంతా శాంతించారు.

News February 16, 2026

మహాశివరాత్రి జాతరను ప్రశాంతంగా నిర్వహించాం: ఎస్పీ

image

వేములవాడ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించామని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారని సిబ్బందిని అభినందించారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో నిఘా పటిష్ఠం చేశామని, భక్తులకు అవసరమైన చోట సహాయం అందించామని వెల్లడించారు.

News February 16, 2026

APPLY NOW: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఉడిపి<<>> కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 13 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. సంబంధిత విభాగంలో BE, BTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. AGMకు నెలకు రూ.1.65,440, Sr.మేనేజర్‌కు రూ.1,44,760, మేనేజర్‌కు రూ.1,24,080, డిప్యూటీ మేనేజర్‌కు రూ.1,03,400 చెల్లిస్తారు. PPP,గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in