News March 16, 2025
ఏలూరులో రేపటి నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

ఏలూరు జిల్లాలో శనివారంతో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. సంబంధిత ఆన్షర్ షీట్లను సోమవారం నుంచి దిద్దనున్నారు. ఏలూరు కోటదిబ్బ జూనియర్ కళాశాలలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందని రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కె.యోహాను తెలిపారు. ఇంగ్లిషు, తెలుగు, లెక్కలు, హిందీ, సివిక్స్ సబ్జెక్టులకు ఎంపిక చేసిన అధ్యాపకులు ఉదయం 10 గంటలకు వాల్యుయేషన్ సెంటర్ వద్దకు రావాలని ఆయన ఆదేశించారు.
Similar News
News July 6, 2025
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6.8 మి.మీ వర్షపాతం నమోదు

ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం 8:30 నుంచి ఆదివారం ఉదయం 8:30 వరకు 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. రఘునాథపాలెం మండలంలో 1.0, ఏన్కూరు మండలంలో 5.8 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు. ఈ రెండు మండలాలు మినహా గడిచిన 24 గంటల్లో ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.
News July 6, 2025
ఐఐఐటీకి తగ్గుతున్న వికారాబాద్ జిల్లా విద్యార్థుల సంఖ్య

వికారాబాద్ జిల్లా నుంచి ఐఐఐటీలో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతి అభ్యసించిన విద్యార్థుల మార్కుల ఆధారంగా బాసరలో అడ్మిషన్లు పొందుతున్నారు. గతేడాది VKB జిల్లా నుంచి 18 మంది ఐఐఐటీకి ఎంపికవగా.. ఈ ఏడాది కేవలం ఆరుగురు మాత్రమే ఎంపికవడం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లాలో మరో ఐఐఐటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
News July 6, 2025
శ్రీకాకుళం జిల్లాలో యువకుడు దారుణ హత్య

కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు (21) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ చింతాడ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.