News July 4, 2025

ఏలూరులో వినతులు స్వీకరించిన ఎస్పీ

image

ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ప్రతాప్ కిషోర్ సిబ్బంది సమస్యలను వినతుల రూపంలో స్వీకరించారు. జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న పోలీసులు, ఏఆర్ సిబ్బంది, హోమ్ గార్డ్‌లు వారి సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని ఎస్పీ హామి ఇచ్చారు.

Similar News

News July 4, 2025

జగిత్యాల: ‘డ్రెయిన్‌లు, వాగులు తక్షణం శుభ్రపరచాలి’

image

JGTL మునిసిపాలిటీలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద డ్రెయిన్‌లు, వాగులు, ప్రభుత్వ భూముల శుభ్రత పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. గోవిందపల్లి, శంకులపల్లి, సోడా సెంటర్, రామాలయం, SRSP కాలువ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మునిసిపల్‌, నీటిపారుదల‌, ఎండోమెంట్ శాఖల సమన్వయంతో పని జరగాలని, ప్రైవేట్ భూముల్లో ముల్లు మొక్కలు తొలగించకపోతే జరిమానాలు విధించాలన్నారు.

News July 4, 2025

రైతులు దుష్ప్రచారాలను నమ్మవద్దు: ఢిల్లీరావు

image

ఎరువుల తయారీదారులు, పంపిణీదారులతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు శుక్రవారం విజయవాడలో సమావేశమయ్యారు. యూరియా ఎరువుల నిల్వలు రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే 30% అధికంగా యూరియా నిల్వలు ఉన్నాయని ఢిల్లీరావు చెప్పారు. ఎరువుల లభ్యతపై రైతాంగం దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. డీలర్‌లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

News July 4, 2025

జగిత్యాల : ‘CMR బకాయిలు వెంటనే చెల్లించండి’

image

యాసంగి 2023–24 సీజన్‌కు సంబంధించి మిల్లర్లు జులై 27 లోగా CMR బకాయిలను చెల్లించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. JGTL సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక చెల్లింపుల గడువు పొడిగింపు లేదని స్పష్టం చేశారు. పౌరసరఫరాల అధికారులు, FCI, SWC అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.