News August 17, 2024
ఏలూరులో వైసీపీ కార్యాలయం కూల్చివేత

ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ అంశంపై మాజీ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కార్యాలయ కూల్చివేతలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. రెండేళ్ల లీజు కోసం స్థలం తీసుకుని తాత్కాలిక నిర్మాణం చేపట్టామన్నారు. లీజు గడువు ముగియడంతో భవనాన్ని యజమానికి అప్పగించామని చెప్పారు. ఇక వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగతంగా ఇకపై అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
జావెలిన్ త్రోలో కొంతేరు కుర్రాడి సత్తా

యలమంచిలి(M) కొంతేరు ZPHS 9వ తరగతి విద్యార్థి పెదపూడి అరుణ్ కుమార్ అండర్-17 బాలుర జావెలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం డి. రాంబాబు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెదవేగిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అరుణ్ కుమార్ 42 మీటర్లు జావెలిన్ విసిరి ప్రథమ స్థానం సాధించాడు. ఈ నెల 22న వినుకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అరుణ్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
News November 7, 2025
ప.గో: మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు

ప.గో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సహా 141 మంది అధికారులు 141 పాఠశాలల్లో పరిశీలించారు. ఇటీవల కాళ్లలో కుళ్లిన కోడిగుడ్లు బయటపడటంతో అధికారులు గుడ్లను నిశితంగా పరిశీలించారు. జిల్లాలో సుమారు 80 వేల మంది విద్యార్థులకు భోజనం అందుతోందని అధికారులు తెలిపారు.
News November 7, 2025
నరసాపురం వరకు పొడిగించిన వందే భారత్ రైలు

కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ చేసిన కృషి ఫలించింది. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు చెన్నై నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే శాఖ నుంచి దక్షిణ మధ్య రైల్వేకు గురువారం ఉత్తర్వులు అందాయి. దీంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


