News March 2, 2025

ఏలూరులో వ్యాపారి ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో జరిగింది. పట్టణంలోని ఫత్తేబాదకు చెందిన విద్యాసాగర్(38) స్థానికంగా ఒక ఫ్యాన్సీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. భార్య, ఇద్దరు కుమార్తెలు వైజాగ్‌లోని పుట్టింటికి వెళ్లారు. ఈ సమయంలో శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యాపారం కోసం అప్పులపాలు కావడమే ఆత్మహత్యకు కారణంగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 25, 2026

విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు

image

నగరంలో గల జిల్లా కోర్టులో ఆర్డీఎక్స్ బాంబు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తి ఈ మెయిల్ పంపాడు. సిబ్బంది వెంటనే స్పందించి నగర పోలీస్ కమిషనర్‌కు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టుకు చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు కోర్టు ఆవరణం మొత్తం జల్లెడ పట్టారు. ఎక్కడా ఎటువంటి బాంబు లేదని వారు నిర్ధారించారు.

News February 25, 2026

SKLM: ‘డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి’

image

డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.

News February 25, 2026

నిత్యమల్లి సాగుతో ఏడాదికి రూ.1.2కోట్లు!

image

సంప్రదాయ పంటలతో నష్టాలు చూస్తున్న ఒడిశాలోని గంజాం జిల్లా రలబ గ్రామ రైతులు పూల సాగుతో భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. గ్రూపులుగా ఏర్పడి రజనీగంధ (నిత్యమల్లి) సాగుతో ఏడాదికి ₹1.2 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. పూలను భువనేశ్వర్, కోల్‌కతా వంటి నగరాల మార్కెట్లకు తరలించి మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ పంట కష్టాల్లో ఉన్న రైతులకు కొత్త ఆశను చూపుతూ స్మార్ట్ అగ్రికల్చర్‌కు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.