News December 10, 2025
ఏలూరులో AI ల్యాబ్‌లు: MP

ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటుకు MP పుట్టా మహేశ్ కుమార్ చర్యలు చేపట్టారు. ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటు ఖర్చు సమకూర్చాలని ONGC సంస్థతో మాట్లాడి ఒప్పించినట్లు పేర్కొన్నారు. MP విజ్ఞప్తి మేరకు CSR కింద ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.
Similar News
News March 10, 2026
పెద్దపల్లి: ఈనెల 13న జాబ్ మేళా

పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు ఈనెల 13న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి వై.తిరుపతిరావు తెలిపారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌లో మూడు నెలల శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు. డిప్లొమా, బీటెక్ అర్హత కలిగి 18–28 ఏళ్ల మధ్య ఉన్నవారు నూతన కలెక్టరేట్ భవనం, రూమ్ నం.233లో ఉదయం 11 గంటలకు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.
News March 10, 2026
అమరావతిలో కలెక్టర్ల సదస్సుకు ప.గో కలెక్టర్ నాగరాణి

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మార్చి 11, 12న జరగనున్న కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ నాగరాణి హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశంలో జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ అంశాలపై విపులంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ‘స్వర్ణాంధ్ర @ 2047’ పది సూత్రాల అమలు, శాంతిభద్రతలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై సీఎం సమీక్షించనున్నారు.
News March 10, 2026
మీ గ్యాస్ సిలిండర్ బుక్ అవుతోందా?

గల్ఫ్ యుద్ధంతో మన దగ్గర గ్యాస్ సప్లైలో కొరత ఏర్పడింది. డొమెస్టిక్ సిలిండర్లు ఆన్‌లైన్‌లో బుక్ అవ్వడం లేదని కొందరు వాపోతున్నారు. 10 రోజుల కింద బుక్ చేసినా డెలివరీ చేయడం లేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే కొన్ని ఏజెన్సీలు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. బుకింగ్ సమస్య మీకూ ఎదురవుతోందా? అయితే సంబంధిత సంస్థలకు మెయిల్, ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయండి.


