News February 6, 2025

ఏలూరు: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

image

ఏలూరులో పలు నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసి పోలీసులు వారి వద్ద నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ తెలిపారు. నేరానికి పాల్పడిన వారిలో ముగ్గురు నిందితులు కాగా ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు చెందిన నేరస్థులుగా గుర్తించారు. పలు కేసులలో నిందితులన్నారు.

Similar News

News March 6, 2026

ఇది నిజంగా ‘బంగారు బాతు’

image

‘బంగారు బాతు గుడ్డు’ కథ అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో దురాశపరుడైన యజమాని దాన్ని చంపి నిరాశకు లోనవుతాడు. కానీ చైనాలోని గ్రామంలో ఓ వ్యక్తికి బాతు చనిపోతూ కనక వర్షం కురిపించింది. మాంసం కోసం కోస్తుండగా కడుపులో 10గ్రా. బంగారం బయటపడింది. ఆ ఏరియాలో గోల్డ్ నిల్వలకు పేరున్న నది ఉండేదని నమ్మకం. దాని ఒడ్డునే తిరిగే ఈ బాతు బురద కలిసిన కీటకాలను తినడంతో కడుపులోకి పసిడి చేరి ఉండొచ్చని అతను భావిస్తున్నాడు.

News March 6, 2026

పాలమూరు: రాష్ట్రస్థాయి పోటీలకు గిరిజన విద్యార్థులు

image

రాష్ట్రస్థాయి 69వ ఎస్జీఎఫ్ అండర్-14 బాలుర సాఫ్ట్ బాల్ పోటీలకు పీఎం శ్రీ ఉమ్మడి జిల్లా కొండాపూర్ గిరిజన పాఠశాల నుంచి 7వ తరగతి చదువుతున్న వికేష్, విగ్నేష్, అభిరాం ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజారాం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో రేపటి నుంచి ప్రారంభమయ్యే టోర్నీలో పాల్గొననున్నారు. దీంతో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్, సాంబియా నాయక్, పీడీలు హర్షం వ్యక్తం చేశారు.

News March 6, 2026

అమ్మానాన్నల మార్గదర్శకత్వమే ఐఏఎస్‌ను చేసింది: తరుణ్

image

హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన అట్ల రవీందర్ – అమరావతి దంపతుల కుమారుడు తరుణ్ తేజ సివిల్ సర్వీస్‌లో 123వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2024లో ఐఎఫ్ఎస్‌గా ఎంపికైన తరుణ్ తేజ తెలంగాణ క్యాడర్‌కి నియమించబడడం గమనార్హం. తరుణ్ తల్లిండ్రులిద్దరూ ఫిజికల్ సైన్స్ టీచర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో ఈ విజయం సాధించానని తరుణ్ తెలిపారు.