News January 28, 2025
ఏలూరు: అక్కడ 10 తర్వాత షాపులు క్లోజ్

నేరాల కట్టడికి ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కామవరపుకోట మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న షాపులను రాత్రి 10కల్లా క్లోజ్ చేయాలని తడికలపూడి ఎస్ఐ చెన్నారావు సూచించారు. రెస్టారెంట్లు, హోటల్స్, డాబాలు, మద్యం దుకాణాలు, కిల్లి షాపులు సైతం సమయపాలన పాటించాలన్నారు. బీట్ కానిస్టేబుల్స్ తిరిగే సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా షాపులు నిర్వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News February 22, 2026
సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News February 22, 2026
స్వర్ణోత్సవాలకు కేయూ సిద్ధం..!

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 1976లో స్థాపించారు. 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. ఉన్నత విద్యను అందిస్తూ NAAC నుంచి A+ గ్రేడ్ గుర్తింపు పొందింది. 27 విభాగాలు, అనేక అనుబంధ కళాశాలలతో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్ట్స్, సైన్స్‌లో సుమారు 95+ కోర్సులను అందిస్తోంది. UG, PG, Ph.Dతో పాటు SDLCE ద్వారా దూరవిద్య కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 473కు పైగా అనుబంధ కళాశాలున్నాయి.
News February 22, 2026
KNR: మెదడు వాపు.. అప్రమత్తతే శ్రీరామ రక్ష..!

మెదడు వాపు వ్యాధి ప్రాణాంతకమైనదే కాకుండా నయం అయిన తర్వాత కూడా మనిషిని శారీరక, మానసిక వైకల్యానికి గురిచేసే ప్రమాదకర వ్యాధి. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 22న ప్రపంచ మెదడు వాపు నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.


