News January 27, 2025
ఏలూరు: అయ్యో పాపం..!

ఓ చిన్నారి ఎంతో వేదన అనుభవించి చనిపోయాడు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. మండవల్లి మండలం భైరవపట్నంలో శుక్రవారం రాత్రి గ్యాస్ సిలిండర్లు పేలి 9 గుడిసెలు <<15251500>>దగ్ధమయ్యాయి. <<>>ఈ ఘటనలో దుబ్బా వంశీ, అన్ను కుమారుడు విక్కీ(3) తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలుడు కోలుకోలేక ఆదివారం కన్నుమూశాడు.
Similar News
News November 14, 2025
ఈనెల 18న అమలాపురంలో జాబ్ మేళా

ఈనెల 18న అమలాపురంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ గురువారం వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జోయాలుకాస్‌లో సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా పని చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో ఫ్రెషర్స్, సీనియర్స్ దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాల వయసు నిండినవారు అర్హులన్నారు.
News November 14, 2025
ఉండి: ‘దివ్యాంగ పిల్లలను ఆదరించాలి’

సమాజంలో ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పిల్లలను ఆదరించాలని సహిత విద్య సమన్వయకర్త టి. శ్రీనివాసరావు అన్నారు. ఉండి నియోజకవర్గం స్థాయిలో ప.గో. జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి పిల్లల తల్లిదండ్రులకు ఆయన అవగాహన కల్పించారు. MEO వినాయకుడు, భవిత కేంద్రం టీచర్ మధు, ఫిజియోథెరపిస్ట్ పాల్గొన్నారు.
News November 14, 2025
NZB: త్వరలో అగ్రికల్చర్ కళాశాలకు శంకుస్థాపన: మహేష్ గౌడ్

అగ్రికల్చర్ కళాశాల త్వరలో తెలంగాణ యూనివర్సిటీలో శంకుస్థాపన చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తుందన్నారు. జిల్లాలో 35 ఏళ్ల నిరీక్షణకు తెరదించి ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేశామన్నారు. కరీంనగర్, బాసర రోడ్డు అభివృద్ధికి రూ.350 కోట్లు మంజూరు చేశామన్నారు.


