News July 4, 2025
ఏలూరు: అల్లూరికి నివాళులర్పించిన ఎస్పీ

ఏలూరులో పోలీస్ ప్రధాన కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బ్రిటిష్ వారిపై అల్లూరి చేసిన స్వాతంత్ర్య పోరాటం మరువలేమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సూర్య చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 4, 2025
జగిత్యాల: ‘మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి’

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం అయన సందర్శించారు. ఈ సందర్భంగా భోజనం నిర్వహణను, వంట సరుకుల నాణ్యతను, బియ్యం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేశారు. ఆయన వెంట ఆర్డీఓ మధుసూదన్ తదితరులున్నారు.
News July 4, 2025
వనపర్తి: ‘గురుకుల విద్యార్థులకు అన్ని వసతులు కల్పించండి’

ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన వనపర్తిలోని కేడీఆర్ నగర్‌లో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను, జగత్పల్లిలో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్, నాగవరంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే స్కూళ్లను తనిఖీ చేశారు.
News July 4, 2025
ఈ స్కిల్స్ పెంచుకుంటే విజయం మీదే!

ఏ రంగంలోనైనా సక్సెస్ పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటే విజయం మీ సొంతం అవుతుందని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా చెప్పారు. ‘ప్రతి ఒక్కరూ తమ సంస్థాగత నైపుణ్యాలు, డెసిషన్ మేకింగ్ & ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్, సెల్ఫ్ మేనేజ్మెంట్ & నాయకత్వ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ & క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, పరిశోధన- విశ్లేషణ స్కిల్స్, టీమ్ వర్క్ స్కిల్స్, రైటింగ్స్ నైపుణ్యాలను పెంచుకోవాలి’ అని తెలిపారు.