News February 7, 2025

ఏలూరు ఆర్ఐవోగా యోహన్

image

ఏలూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి(ఆర్ఐవో)గా  కె.యోహన్ నియమితులయ్యారు. ఏలూరు కోట దెబ్బ ప్రాంతంలోని కార్యాలయంలో ఆయన గురువారం బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత కలెక్టర్ వెట్రి సెల్విని కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఆగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ ఏలూరు జిల్లా ఆర్ఐఓవోగా నియమితులయ్యారు.

Similar News

News February 7, 2025

బంగ్లాదేశ్‌ నటిపై దేశద్రోహం కేసు

image

బంగ్లాలో మహ్మద్ యూనస్ మధ్యంతర సర్కారుపై విమర్శలు చేసిన నటి మెహెర్ ఆఫ్రోజ్‌పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. జమాల్‌పూర్‌లోని ఆమె ఇంటిపై దుండగులు దాడి చేసి నిప్పు పెట్టడం గమనార్హం. బహిష్క‌ృత నేత హసీనాకు చెందిన ఆవామీ లీగ్‌లో ఆఫ్రోజ్ తండ్రి సభ్యుడిగా ఉన్నారు. ఆమె తల్లి అదే పార్టీ తరఫున రెండుసార్లు ఎంపీగా పనిచేశారు.

News February 7, 2025

NRPT: ఐదుగురిపై కేసు నమోదు

image

సురక్షిత ప్రయాణానికి వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్ఐ రేవతి అన్నారు. గురువారం నారాయణపేట పట్టణంలోని పలు కోడెలలో వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 36 వాహనాలకు రూ.12,520 జరిమానాలు, పెండింగ్లో ఉన్న 61 వాహనాల జరిమానాలు వసూలు చేసినట్లు చెప్పారు. ఐదుగురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.  

News February 7, 2025

సినిమా రంగంలో కురవి కుర్రాడు!

image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. శుక్రవారం విడుదలయ్యే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేయనున్నారు.

error: Content is protected !!