News February 23, 2026

ఏలూరు: ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 1,014 మంది గైర్హాజరు

image

ఏలూరు జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షలకు 17,864 మంది హాజరు కావలసి ఉండగా 16,850 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1,014 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారని వివరించారు. మొదటిరోజు పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయన్నారు. రేపటి పరీక్షకు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయంలోపు రావాలన్నారు.

Similar News

News February 27, 2026

NLG: రోడ్డు ప్రమాదం.. పంచాయతీ సెక్రటరీ మృతి

image

అనుముల మండలంలోని పులిమామిడి పంచాయతీ కార్యదర్శి అవుట మోహన్‌రావు (50) శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ నుంచి విధులకు వెళ్తుండగా లింగోటం వద్ద ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మోహన్‌రావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన స్వగ్రామం తిప్పర్తి మండలం పజ్జూరు.

News February 27, 2026

మాదారం చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

image

ఊర్కొండ మండలం రాచలపల్లికి చెందిన బూర్గుల వెంకటయ్య(46) శుక్రవారం మాదారం చెరువులో శవమై తేలారు. రెండు రోజులుగా గల్లంతైన ఆయన కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, ఈ ఉదయం చెరువులో మృతదేహం కనిపించింది. వెంకటయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని ఇంకా బయటకు తీయాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

News February 27, 2026

ఏలూరు జిల్లాలో వైరల్‌గా మారిన ఉద్యోగిని లెటర్

image

ఏలూరులోని తంగెళ్ల మూడి సచివాలయంలో ANMగా పనిచేస్తున్న కామేశ్వరి రాసినట్లు ఉన్న లేఖ సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. పని ఒత్తిడిలో తాను అలసిపోయానని, సెలవు ఇప్పించాలని ఉన్నతాధికారులకు అర్జీ ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నట్లు ఉంది. సెలవు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పడంతో కామేశ్వరి బుధవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తన మెంటల్ కండీషన్ బాగోలేదని లేఖలో రాసినట్లు ఉంది.