News November 23, 2025
ఏలూరు: ఈనెల 25న విభిన్న ప్రతిభావంతుల క్రీడలు

వచ్చే నెల 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఏడీ రామ్‌కుమార్ తెలిపారు. ఈ పోటీల్లో సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ వెట్రిసెల్వి హాజరవుతారని, విజేతలకు బహుమతులు అందజేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
Similar News
News November 24, 2025
వరంగల్: కమిషనరేట్ పరిధిలో 82 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 82 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 35 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.
News November 24, 2025
HNK జిల్లాలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

HNK కలెక్టరేట్లో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పంచాయతీ ఎన్నికలకు జిల్లాలోని 12 మండలాల్లోని 210 సర్పంచులు, వార్డు సభ్యులకు రిజర్వేషన్ల ఖరారు చేశారు. వివరాలు టీ పోల్‌లో నమోదు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జడ్పీసీఈవో రవి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేశ్, డా.కె.నారాయణ పాల్గొన్నారు.
News November 24, 2025
INDvsSA.. భారమంతా బ్యాటర్లపైనే!

IND, SA మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో నేడు మూడో రోజు ఆట కీలకం కానుంది. భారత్ విజయావకాశాలపై ఈరోజు ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. తొలి ఇన్నింగ్స్‌లో SA భారీ స్కోర్(489) చేయడంతో IND బ్యాటర్ల బాధ్యత మరింత పెరిగింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలంటే బ్యాటర్లు సమష్ఠిగా రాణించాల్సిన అవసరముంది. ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జైస్వాల్ కీలకంగా మారతారని అనిల్ కుంబ్లే అన్నారు. ప్రస్తుతం IND 480 రన్స్ వెనుకబడి ఉంది.


