News May 10, 2024

ఏలూరు: ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. డబ్బులు తీసుకోం’

image

ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన వీరమల్ల మధు కుటుంబీకులు ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. డబ్బులు తీసుకోము కానీ తప్పకుండా ఓటు వేస్తాము’ అనే బ్యానర్‌ను ఇంటి గేటుకు ఏర్పాటుచేశారు. కాగా ఈ బ్యానర్ పలువురిని ఆలోచింపచేస్తుంది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.

Similar News

News December 30, 2025

భీమవరం: ఈవీఎంల భద్రతపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

భీమవరం పట్టణంలోని పీపీ రోడ్డులో గల ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్లకు వేసిన సీళ్లను, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె, రిజిస్టర్లలో సంతకాలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి మూడు నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News December 30, 2025

పాలకొల్లు ఉపాధ్యాయునికి ‘గురు చైతన్య’ పురస్కారం

image

పాలకొల్లు: పట్టణంలోని జీవీఎస్వీఆర్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని జి.నందిని ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు ఎంపికయ్యారు. గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లాకు ఏడుగురు చొప్పున ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. జనవరి 3న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

News December 30, 2025

వంద ఏళ్ల నిరీక్షణకు తెర.. ‘మోదెల’ గ్రామానికి విద్యుత్ భాగ్యం!

image

శతాబ్ద కాలంగా విద్యుత్‌కు నోచుకోని మారుమూల గిరిజన గ్రామం ‘మోదెల’ ఎట్టకేలకు సౌరకాంతులతో మెరిసిపోయింది. జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ వెట్రిసెల్వి చొరవ తీసుకుని రూ. 12.5 లక్షలతో సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయించారు. 23 గిరిజన ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లభించడంతో, గ్రామస్తులు కలెక్టరేట్‌కు విచ్చేసి జేసీ ఎం.జె. అభిషేక్ గౌడ, విద్యుత్ శాఖ అధికారులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.