News November 7, 2024

ఏలూరు: ఎన్నికల నియమావళి అమలుకు బృందాలు ఏర్పాటు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్ధానానికి ఉపఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం ప్రత్యేక అధికార బృందాలను నియమిస్తూ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్, మండల స్ధాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఈ బృందాలు పర్యవేక్షిస్తాయన్నారు. 43 ప్రత్యేక వీడియో బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News September 15, 2025

పాలకోడేరు: గోస్త నదిలో పడి ఒకటో తరగతి విద్యార్థి గల్లంతు

image

పాలకోడేరు(M) వేండ్ర శివారు కట్టవారిపాలెంకు చెందిన బొక్క శ్రీనివాస్ రావు రెండో కుమారుడు జైదేవ్(7) గోస్త నదిలో పడి ఆదివారం గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవుడూరులోని ప్రైవేట్ స్కూల్లో జైదేవ్ 1వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితుడితో కలిసి సైకిల్ తొక్కుతూ గోస్త నది వంతెన మీదకు వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

News September 15, 2025

భీమవరం: ఉపాధి శ్రామికులకు బకాయి వేతనాల చెల్లింపు

image

ప.గో జిల్లాలో ఉపాధి శ్రామికులకు వేతన బకాయిలు విడుదల అయ్యాయి. జిల్లాలోని 99 వేల మందికి గాను రూ.55 కోట్లు మేర వారి అకౌంట్లలో అధికారులు జమ చేశారు. నాలుగు నెలలుగా వేతనాలు రాక శ్రామికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దసరా ముందు నిధులు విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిధుల విడుదలలో జాప్యం కారణంగానే ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.

News September 15, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం జిల్లా, మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను సమీపంలోని కార్యాలయాల్లో లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.