News January 31, 2025
ఏలూరు: ఎన్నికల నియమావళి పాటించాలి- కలెక్టర్

తూ.గో, పా.గో, ఏలూరు జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. పోలింగ్ స్టేషన్లకు సంబంధించి వెయ్యికి పైగా ఓటర్లు ఉంటే వేరే పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాధనలను ఈ నెల 31న సమర్పించాలన్నారు. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
Similar News
News September 18, 2025
మరికాసేపట్లో నీరజ్ ఫైనల్ ఈవెంట్

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రో ఫైనల్ సా.3.53 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇండియా తరఫున నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నారు. ఫైనల్ ఈవెంట్లో మొత్తం 12 మంది పోటీ పడుతున్నారు. అయితే జూలియన్ వెబెర్(జర్మనీ) పెటెర్స్(గ్రెనెడా), అర్షద్ నదీమ్(పాక్) నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. వారందరినీ వెనక్కి నెట్టి అతడు బంగారు పతకం సాధించాలని కోరుకుందాం.
ALL THE BEST NEERAJ(హాట్‌స్టార్‌లో లైవ్)
News September 18, 2025
భూగర్భ జలాలను పెంచాలి: గోదావరి డెల్టా ఛైర్మన్

భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోదావరి డెల్టా ఛైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి భూగర్భ జలాలు పెంచేందుకు తయారుచేసిన ప్రాజెక్టు రిపోర్టును అందజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు చెరువులు కాలువల్లో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోదావరి డెల్టా ఛైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు.
News September 18, 2025
సీఎంతో డీఎస్సీ అభ్యర్థుల సమావేశం వాయిదా: డీఈవో

వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో శుక్రవారం అమరావతిలో జరగాల్సిన డీఎస్సీ ఉపాధ్యాయుల సమావేశం వాయిదా పడినట్లు డీఈఓ షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా కలెక్టర్ నుంచి ఈ సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓలు డీఎస్సీ అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. తదుపరి సమావేశం తేదీని ఇంకా నిర్ణయించలేదని, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.