News March 29, 2025

ఏలూరు: ఏప్రిల్ 1న సోషల్ పరీక్ష..డీఈవో 

image

జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో సోషల్ పరీక్ష పై నేటి వరకు సందిగ్ధత నెలకొంది. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మార్చి 31న జరగాల్సిన సోషల్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ ప్రకటించారు. దీనికి అనుకూలంగా యాజమాన్య సంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇన్విజిలేటర్లు సిద్ధపడాలని ఆమె సూచించారు.

Similar News

News July 4, 2025

NLG: ‘కొమురయ్య పోరాట పటిమ ఆదర్శప్రాయం’

image

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని సీపీఎం నేతలు నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవనంలో శుక్రవారం నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. ఆయన పోరాట పటిమ అందరికీ ఆదర్శప్రాయమన్నారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆయన జరిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

News July 4, 2025

BJP, RSSలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్లు ఉన్నారా?: ఖర్గే

image

TG: దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని AICC చీఫ్ ఖర్గే అన్నారు. ‘పాక్‌ను ఇందిరా గాంధీ రెండు ముక్కలు చేశారు. మరి మోదీ ఏం చేశారు? PAKను అంతం చేస్తామని చెప్పి యుద్ధాన్ని ఆపారు. 42 దేశాల్లో పర్యటించిన ఆయన మణిపుర్ ఎందుకు వెళ్లలేదు? ఆయనకు బిహార్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదు. గాంధీ కుటుంబంలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్లున్నారు. BJP, RSSలో ఉన్నారా?’ అని HYDలో ప్రశ్నించారు.

News July 4, 2025

కరీంనగర్: బయట ఫుడ్ తింటున్నారా..? బీ కేర్ ఫుల్

image

KNR, జ్యోతినగర్‌లోని రాజుగారి బిర్యానీ అడ్డా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డి ఈరోజు తనిఖీ చేశారు. ఒక ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు జరిగాయి. కిచెన్, ఫ్రీజర్‌లో ముందురోజు మిగిలిపోయిన 17KGల వండిన చికెన్‌, కార్న్, ఇతర కూరగాయలు, వస్తువులను గుర్తించి ధ్వంసంచేశారు. చికెన్ ఐటమ్స్‌లో కృత్రిమరంగులు వాడినందుకు నోటీసులు జారీచేశారు. మాంసాహార ముడిపదార్థాలపై తప్పనిసరిగా తేదీ, లేబుల్ వేయాలని ఆదేశించారు.