News April 25, 2024
ఏలూరు: ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన: JC

దెందులూరు అసెంబ్లీ పరిధిలో 5వ రోజు బుధవారం ఏడుగురు అభ్యర్థులు తొమ్మిది నామినేషన్లు దాఖలు చేశారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి బుధవారం వెల్లడించారు. కాగా ఏప్రిల్ 26న ఉదయం 11 గంటలకు అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు.
Similar News
News December 23, 2025
ఏలూరు జిల్లాలో 92.93 శాతం మందికి పోలియో చుక్కలు

ఏలూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి గీతాబాయి తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఐదేళ్లలోపు పిల్లలకు బూత్‌లలోనూ, ఇంటింటికీ తిరిగి చుక్కలు వేశారు. జిల్లావ్యాప్తంగా 1,87,204 మంది చిన్నారులకు గాను, 1,73,975 (92.93%) మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆమె వెల్లడించారు.
News December 23, 2025
ప.గో: జిల్లాకు 5,288 టన్నుల యూరియా సరఫరా

జిల్లాకు డిసెంబర్ నెలకు సంబంధించి 23,018 టన్నుల యూరియా తాడేపల్లిగూడెం రైల్వే ర్యాక్‌కు వచ్చిందని, ప్రైవేట్ డీలర్లు, మార్క్ ఫెడ్, సొసైటీలకు 5,288 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు ఏడీఏ ఆర్.గంగాధర్ రావు మంగళవారం తెలిపారు. తాడేపల్లిగూడెం 1,653, పెంటపాడు 485 టన్నులు డీలర్ల వద్ద నిల్వ ఉందన్నారు. యూరియా నిల్వలను ప్రైవేట్, సొసైటీ, రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
News December 23, 2025
పెనుమంట్ర: రోడ్డు ప్రమాదంపై త్రిసభ్య కమిటీ వేసిన కలెక్టర్

పెనుమంట్ర మండలం పొలమూరులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పందించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసు, రవాణా శాఖలతో పాటు ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయాలని ఆమె ఆదేశించారు.


