News October 27, 2025
ఏలూరు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

తుపాన్ తీవ్రతపై జిల్లా యంత్రాంగం తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ఎస్పీతో కలిసి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి అప్రమత్తం చేశారు. అన్ని మండల, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబర్ 94910 41419, టోల్ ఫ్రీ నంబర్ 180023 31077కు ఫోన్ చేసి ప్రజలు తుపాన్ పరిస్థితిని తెలుసుకోవచ్చన్నారు.
Similar News
News October 27, 2025
HYD: నిద్రలో గురక పెడుతున్నారా?

నిద్రలో శ్వాస లోపాలపై నిమ్స్‌లో అవగాహన సదస్సు జరిగింది. డైరెక్టర్ ప్రొ.నగరి బీరప్ప మాట్లాడుతూ.. ‘ఆబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)ను నిర్లక్ష్యం చేయవద్దు. ఇది గుండె, మధుమేహంపై ప్రభావం చూపుతుంది’ అన్నారు. ప్రొ.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ..‘గురక తీవ్ర వ్యాధికి సంకేతం. ఇది BP, గుండె జబ్బులకు దారి తీస్తుంది. పాలీ సామ్‌నోగ్రఫీ (Sleep Study) ద్వారా వెంటనే చికిత్స తీసుకోవాలి’ అని సూచించారు. SHARE IT.
News October 27, 2025
మిరప ముంపునకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాల వల్ల పూత, కాత దశలో ఉన్న పచ్చిమిచ్చిలో శనగపచ్చ పురుగు, కాల్షియం లోపం, వేరుకుళ్లు సమస్యలు వస్తాయి. మిరపలో శనగపచ్చ పురుగు నివారణకు లీటరు నీటికి ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4గ్రా లేదా క్లోరాంట్రినిలిప్రోల్ 0.3mlను కలిపి పిచికారీ చేయాలి. కాల్షియం, ఇతర సూక్ష్మధాతు లోప నివారణకు లీటరు నీటికి ఆగ్రోమిన్ మాక్స్ (ఫార్ములా-6) 5 గ్రాములు, కాల్షియం నైట్రేట్ 5 గ్రాములను కలిపి 2-3 సార్లు పిచికారీ చేయాలి.
News October 27, 2025
అనకాపల్లి: మొంథా తుఫానుపై ప్రత్యేక అధికారి ఆరా

మొంథా తుఫాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లా సైక్లోన్ ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్ ఎప్పటికప్పుడు జిల్లా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆదివారం జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో పర్యటించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం కూడా ఆయన పలు శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. తీర గ్రామాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిక కావాలని ఆదేశించారు.


