News August 21, 2024

ఏలూరు: కత్తిపోట్లకు దారితీసిన భారత్ బంద్

image

ఏలూరు టి.నరసాపురం మండలంలో బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ పలు దళిత సంఘాలకు చెందిన నాయకులు బంద్‌కు సహకరించాలని బంధంచర్ల గ్రామంలో పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక హోటల్ యాజమాన్యంతో జరిగిన వాగ్వాదంలో హోటల్ యాజమాని దళిత యువకుడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో గాయాలు పాలైన బాధితుడిని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News February 20, 2026

తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారులు

image

తిరుమలలో అపహరణకు గురైన ఇద్దరు చిన్నారులను పోలీసులు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు తణుకునకు చెందిన లక్ష్మీ,రాంబాబు దంపతులు తమ కుమార్తెలు నవదుర్గ, అశ్వినీలతో ఈ నెల 16న తిరుమల వచ్చారు. బాలికలు ఆడుకుంటూ ఉండగా అన్నమయ్య జిల్లాకు చెందిన గుండ్లూరు శివమ్మ వారిని అపహరించి తన వెంట తీసుకుపోయింది. తిరుమల పోలీసులు సిసి ఫుటేజీలను పరిశీలించి 17న కొవ్వూరు రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకుని చిన్నారులను అప్పగించారు.

News February 19, 2026

నరసాపురం: బలవన్మరణానికి పాల్పడిన బాలిక

image

నరసాపురం పట్టణంలో బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ బాలిక ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం కుటుంబీకులు ఆసుపత్రికి తరలించినా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి చెప్పారు. దీనిపై టౌన్ ఎస్ఐ జయలక్ష్మి కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2026

ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి బిఎల్ఓలను ఆదేశించారు. బుధవారం భీమవరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల నమోదు, మార్పుల క్లైమ్ల పరిష్కారంపై సమీక్షించారు. ముఖ్యంగా యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా పనులు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.