News December 18, 2025

ఏలూరు: కన్న కొడుకే గెంటేశాడు..!

image

కన్నకొడుకే తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన ముదినేపల్లి (M) కొత్తపల్లిలో చోటు చేసుకుంది. బాధితురాలు కోటేశ్వరమ్మ వివరాల మేరకు.. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటిని నిర్మించుకోగా చిన్న కొడుకు దానికి లాక్కున్నాడు. కొంత కాలం ఇంట్లో ఉంటామని చెప్పి కుమారుడు, కోడలు ఇంటిని స్వాధీనం చేసుకుని తనను బయటకు పంపేశారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని బుధవారం ఏలూరులో RDO అచ్యుత అంబరీష్‌ను కోరింది.

Similar News

News December 20, 2025

జోనర్లు మార్చుకుంటున్న రవితేజ

image

గతంలో వరుసగా మాస్ సినిమాలు చేసిన రవితేజ ప్రస్తుతం తన పంథా మార్చారు. ఇటీవల ఒక్కో సినిమాకు ఒక్కో జోనర్ సెలక్ట్ చేసుకొని అలరిస్తున్నారు. ధమాకాతో మాస్, రావణాసురతో థ్రిల్లర్‌కు ఓటేసిన ఆయన టైగర్ నాగేశ్వరరావుతో పీరియాడిక్ డ్రామా ఎంచుకున్నారు. త్వరలో అనుదీప్‌తో కామెడీకి సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి ఫ్యామిలీ డ్రామా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో వస్తున్నారు. ఈ మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.

News December 20, 2025

సిద్దిపేట: దరఖాస్తుల ఆహ్వానం

image

సిద్దిపేట జిల్లాలోని 225 పాఠశాలల్లో విద్యార్థినిలకు ‘రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ’లో కరాటే శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 3 నెలలు సాగే ఈ శిక్షణ కోసం అర్హులైన మహిళా కరాటే మాస్టర్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు 27లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాలికల్లో ఆత్మస్థైర్యం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు.

News December 20, 2025

నంద్యాల: ALL THE BEST హసీనా, అంకిత

image

రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలో నంద్యాల జిల్లా క్రీడాకారులు హసీనా, అంకిత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కోచింగ్‌కు ఎంపికయ్యారు. శిక్షణలో మంచి ప్రతిభ కనబరిస్తే వారిని జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేస్తారని స్పాన్సర్ వసుంధర దేవి తెలిపారు. నంద్యాల జిల్లా నుంచి వీరిద్దరే ఎంపిక కావడం గొప్ప విషయం అన్నారు. చదువులో రాణిస్తూనే క్రీడల్లోనూ ప్రతిభ చూపడం హర్షణీయమన్నారు.