News October 7, 2025
ఏలూరు: కలెక్టరేట్‌లో మహర్షి వాల్మీకి జయంతి

ఏలూరు కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ కె. వెట్రిసెల్వి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేశారు, జ్యోతి ప్రజ్వలన చేశారు. వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలు, ఏడు కాండములతో కూడిన అద్భుత రామాయణాన్ని మానవాళికి అందించారని కలెక్టర్ కొనియాడారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని వాల్మీకి జీవిత చరిత్ర మనకు తెలియజేస్తుందని ఆమె అన్నారు.
Similar News
News October 7, 2025
జూబ్లీహిల్స్ బై పోల్స్.. టీడీపీ ఓటు బ్యాంకుపై నేతల ఆరా

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇపుడు అందరి చూపూ ఓటు బ్యాంకుపైనే ఉంది. ఏయే పార్టీలకు ప్రజలు మద్దతిస్తారనే విషయంపైనే నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఆ తరువాత బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే ఇంకా టీడీపీకి ఓటు బ్యాంకు ఉందని నాయకులు నమ్ముతున్నారు. సైకిల్ పార్టీకి ఎన్ని ఓట్లు ఉంటాయని ఆరా తీస్తున్నారు.
News October 7, 2025
NGKL: మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలోని సాయి నగర్ కాలనీలో జరుగుతున్న మైనర్ బాలిక వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సీడబ్ల్యూసీ (CWC) సభ్యుల సమాచారంతో, అచ్చంపేట ఎస్సై ఇందిర, షీ టీం బృందాలు అక్కడకు చేరుకున్నారు. బాల్య వివాహం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలిక భవిష్యత్తు దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
News October 7, 2025
నిర్మల్: ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలి

ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందివ్వాలని టీజీ ఎన్.పి.డి.సి.ఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మల్‌లోని కలెక్టరేట్‌లో ఆయన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ వినియోగంపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.